• About
  • Advertise
  • Careers
  • Contact
Thursday, March 30, 2023
PMR News
  • HOME
  • ANDHRA
  • TELANGANA
  • POLITICS
  • INDIA
  • WORLD
  • MOVIES
  • CAREER
  • TECHNOLOGY
  • LIFE STYLE
  • SPORTS
  • PHOTOS
  • HOME
  • ANDHRA
  • TELANGANA
  • POLITICS
  • INDIA
  • WORLD
  • MOVIES
  • CAREER
  • TECHNOLOGY
  • LIFE STYLE
  • SPORTS
  • PHOTOS
No Result
View All Result
PMR News
No Result
View All Result
Home INDIA

Indian Presidential Election: కొత్త రాష్ట్రపతి ఎన్నికల అంచనా

by admin
June 13, 2022
in POLITICS, INDIA, Trending
0
indian presidential election, indian presidential election 2002, indian presidential election candidates, indian presidential election 2022 date
0
SHARES
2
VIEWS

Indian Presidential Election – 2002

వచ్చే జూలై 18వ తేదీన కొత్త రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుందని ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. దానికి ముందునుంచే ఈ విషయమై పలు ఊహాగానాలు వ్యూహాలు సాగుతూ వస్తున్నాయి. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చేసమయానికి ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉండేవారు. కాంగ్రెస్‌ వామపక్షాల మద్దతుతో ఎన్నికైనప్పటికీ ఆయన ప్రధాని నరేంద్రమోడీతోనూ పేచీలు లేకుండా చూసుకున్నారు. మోడీ కూడా తనకు ఆయనపై ప్రత్యేక గౌరవమని చెబుతూ వచ్చారు. మరోసారి కూడా ఆయనను కొనసాగిస్తారనే వరకూ ఈ వూహలు నడిచాయి. కాని అది జరగదని కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా ప్రధాని రాష్ట్రపతి ఎంపికలో పూర్తిగా తమ మనిషినే ఎంచుకుంటారు. భారత రాష్ట్రపతి పదవి బ్రిటిష్‌ రాణి వలె లాంఛనప్రాయమైనదిగా కనిపించినా ప్రత్యేక పరిస్థితులలో నిర్ణాయకంగా మారుతుంది. కాంగ్రెస్‌ గుత్తాధిపత్యం ఉన్నంత వరకూ ఈ విషయం పెద్దగా అర్థం కాలేదు గాని 1977లో ఎమర్జన్సీ తర్వాత కాంగ్రెసేతర ప్రభుత్వాలు, మిశ్రమ ప్రభుత్వాలు ఏర్పడుతున్న కొద్దీ ఈ ప్రాధాన్యత మరింత పెరిగింది. ఇంకా వెనక్కుపోతే అసలు ఎమర్జన్సీ విధించడానికి అప్పటి రాష్ట్రపతి ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌ అంగీకరించడమే ఒక విపరీతం. కాంగ్రెస్‌ తరపున నిలబడిన నీలం సంజీవరెడ్డిని అంతకు ముందు పాత కాంగ్రెస్‌ వర్గం, స్వతంత్ర జనసంఫ్‌ు వంటి పార్టీలు బలపర్చగా ఇందిరాగాందీ ఆత్మప్రబోధానుసారం ఓటేయమని పిలుపునిచ్చి వివి గిరిని కమ్యూనిస్టుల సాయంతో గెలిపించారు. గిరి తర్వాత కాలంలో అత్యంత విధేయుడైన ఫకృద్దీన్‌ను తీసుకొచ్చారు. ఆయన నోరెత్తకుండా ఎమర్జన్సీ విధించి పరమ నిరంకుశ పాలనకు దస్కతుదారుడై ఆమె ఓటమికీ బాట వేశారు. ఆమెను ప్రజలు ఓడించి జనతా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మారిన పరిస్థితులలో అదే సంజీవరెడ్డి అందరి అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. దేశంలో అలాంటి ఏకగ్రీవ ఎన్నిక అదొక్కటే. మిగిలిన రాష్ట్రపతులందరూ ఏవో పార్టీల నుంచి ఎవరో ఒక ప్రత్యర్థిని ఎదుర్కొని గెలవాల్పి వచ్చింది. కేంద్ర రాష్ట్రాలలో భిన్న పార్టీలు పాలించే పరిస్థితి పెరుగుతున్న కొద్దీ ఈ పోటీ ఆసక్తికరంగా మారుతున్నది. అయితే ప్రతిపక్ష అభ్యర్థి ఎప్పుడూ గెలవలేదు. దానికి రాష్ట్రపతి ఎన్నిక విధానం కూడా ఒక కారణం.

ఎలక్టోరల్‌ ఓట్ల లెక్కలు

రాజ్యాంగం 62(1) అధికరణం పదవిలో ఉన్న రాష్ట్రపతి దిగిపోయేలోగా కొత్తవారి ఎన్నిక జరగాలని నిర్దేశిస్తున్నది. అత్యున్నత స్థాయిలో ఎలాంటి శూన్యత ఉండరాదనేది దీని ఉద్దేశం. రాష్ట్రపతి భారత దేశ సమగ్రతకూ సార్వభౌమత్వానికి ప్రతీక. రాజ్యాంగాధినేత. రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీ కాలం జులై 25తో ముగుస్తుంది గనక ఆ లోగానే 18న ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఇది కూడా దేశంలోని వివిధ రాష్ట్రాలలో వారం రోజుల పాటు దశలవారీగా కొనసాగుతుంది. రాష్ట్రపతిని ఎంపీలు, ఎంఎల్‌ఎలు కలసి ఎన్నుకుంటారు. దీన్నే ఎలక్ట్రోరల్‌ కాలేజీ అని పిలుస్తారు. ఇందులో ఎంపీల ఓటు విలువ ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రాలలో 1971 జనాభా ప్రాతిపదికన రాష్ట్రాల ఎంఎల్‌ఎ ఓటు విలువ నిర్ణయమవుతుంది. ఉదాహరణకు యూపీలో అత్యధికంగా 208 ఓట్ల విలువ ఉంటే సిక్కింలో ఏడు మాత్రమే. యూపీలోని 403 మంది ఎంఎల్‌ఎలు కలసి 83,824 విలువ అయితే సిక్కింలో 32 మంది ఎంఎల్‌ఎల ఓటు విలువ 224 మాత్రమే. దేశంలోని మొత్తం4,033 మంది ఎమ్మెల్యేల ఓట్ల విలువ 5.43లక్షల ఓట్లు. లోక్‌సభలోని 543, రాజ్యసభలోని 233 మంది సభ్యులకు కూడా ఎంఎల్‌ఎల సంఖ్యను బట్టి ఓటు విలువ నిర్ణయమవు తుంది. 5.43 లక్షల ఓటు విలువను మొత్తం 700(అసలు సంఖ్య776)తో భాగించి లెక్క కడతారు. అప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్ల మొత్తం విలువ 10.86లక్షలకు చేరుతుంది. ఈ ఎన్నికల కసరత్తులో బీజేపీ ఎన్‌డీఏ మిగిలిన వారికంటే బాగా ఆధిక్యత కలిగివున్నా మెజార్టికి దూరంగానే ఉంది. ఇప్పటికి ఖాళీగా ఉన్న 57 రాజ్యసభ స్థానాలను మినహాయించిచూస్తే బీజేపీకి 42శాతం, దాని మిత్రులకు 6శాతం మొత్తం 5,25,706 ఓట్లున్నాయి. కాంగ్రెస్‌కు13.5, దాని మిత్రులకు10.5శాతం ఓట్లున్నాయి. వామపక్షాలకు 2.5శాతం ఉంటే తృణమూల్‌కు 5.4 శాతం, వైసీపీకి 4శాతం (43,450), బిజెడికి 2.85శాతం అంటే 31,686 ఓట్లు, ఇతరులకు తక్కినవి ఉన్నాయి. ఒట్లను బట్టి చూస్తే బీజేపీ కూటమికి కేవలం 20వేల ఓట్లు మాత్రమే తక్కువ పడతాయి. ఇప్పటికే ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ప్రధాని మోడీని కలుసుకుని వచ్చారు. వారు బీజేపీ చెప్పిన అభ్యర్థికే ఓటు వేస్తారన్న అభిప్రాయం అందరిలో ఉంది. గతసారి కూడా అధికారంలోని టీడీపీ, టీఆర్‌ఎస్‌, ప్రతిపక్షంలోని వైసీపీ బీజేపీ కూటమి అభ్యర్థికే ఓటేశాయి.

రాజ్యాంగ సవాళ్లు – రాష్ట్రపతి

అందువల్ల ఇక్కడ సమస్య గెలుపు ఓటమి కాదు. మూడు తీవ్ర సవాళ్లను దేశం ముందు నిలిపిన ఈ సర్కారు దూకుడుకు పగ్గాలు వేసే ప్రయత్నం విశాల లౌకిక సమీకరణ ముఖ్యం. 1.మోడీ ఏకపక్ష నిరంకుశ పోకడలు 2.సంఫ్‌ుపరివార్‌ విశృంఖల విద్వేష రాజకీయాలు నిలవరించడం కీలకం. ఈ విద్వేష రాజకీయాలు వారు కూడా సమర్థించుకోలేని స్థితికి చేరాయనడానికి ఇటీవల ఇద్దరు నేతలపై వేటు వేయడమే తార్కాణం. చార్మినార్‌ దగ్గర, జిన్నా టవర్‌ దగ్గర కూడా ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. 3.2024 ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై కూడా వీటిప్రభావం చాలా ఉంటుంది. 1979, 1989, 1990, 1991, 1996, 1998, 1999 కాలంలో అప్పటి రాష్ట్రపతి నిర్ణయాల కోసం దేశమంతా చూసింది. విపరీతమైన ఉత్కంఠ ఏర్పడటమే గాక వివాదగ్రస్తమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. సంజీవరెడ్డి అనుభవం తర్వాత ఇందిరాగాంధీ అత్యంత విధేయుడైన జైల్‌సింగ్‌ను రాష్ట్రపతిని చేశారు. ఆమె ఆజ్ఞాపిస్తే పార్లమెంటు భవనం ఊడ్చడానికి కూడా సిద్ధమన్న జైల్‌సింగ్‌ రాజీవ్‌ గాంధీని క్షణాల మీద ప్రధానిగా చేయడమేగాక చివరిదశలో ఆయనను బర్తరఫ్‌ చేసే అధికారం ఉందని వివాదం సృష్టించారు. ఆర్‌.వెంకట్రామన్‌ వంటివారు జాతీయ ప్రభుత్వం వంటి పేరుతో అనిశ్చిత పరిస్థితి సృష్టించారు. శంకర్‌ దయాళ్‌ శర్మ బాబరీ మసీదు విధ్వంసాన్ని అందరికన్నా ముందే ఖండించి లౌకిక భావన చాటారు. ఆయనే 1996లో హడావుడిగా వాజ్‌పేయికి అవకాశమిచ్చి అపకీర్తి మూటకట్టుకున్నారు. ఆ ప్రభుత్వం 13రోజులలోనే నిష్క్రమించాల్సి వచ్చింది. అందుకు భిన్నంగా తొలి దళిత రాష్ట్రపతి కెఆర్‌ నారాయణన్‌ రాజ్యాంగ సమీక్షపేరిట వాజ్‌పేయి సర్కారు చేసిన హడావుడికి అడ్డుకట్ట వేసేలా వ్యవహరించారు. అంతర్జాతీయంగానూ అమెరికా కర్రపెత్తనానికి లోబడనవలసరం లేదని చాటారు. కనుక రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలను, సమైక్యత సమగ్రత సార్వభౌమత్వాలను కాపాడే వారే రాష్ట్రపతిగా ఉండాలనేది అనుభవం. ఇప్పుడు కేంద్రం ఒత్తిళ్లు, బెదిరింపులతో ఫిరాయింపులతో నయానో భయానో సీట్లు కూడగట్టడం చాలా చోట్ల చూశాం. ఆ విధంగా వచ్చే ఎన్నికల తర్వాత సర్కారు ఏర్పాటుపై కూడా రాష్ట్రపతి నిర్ణయం కీలకమయ్యే అవకాశం ఉండొచ్చు. లౌకికశక్తులు తమ బలాన్ని చూపకపోతే ఆయన మరింత పాక్షికంగా వ్యవహరిస్తారనడంలో సందేహం లేదు. కనుకనే వీలైనంతవరకూ ప్రతిపక్షాలు ఒక ఉమ్మడి అభ్యర్థిని నిలిపే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. పట్టు విడుపులతో అలాంటి పోటీ అభ్యర్థిని ఎంపిక చేయడానికి అనేక సంప్రదింపులు, కసరత్తు జరుగుతుంది.

వామపక్షాల వైఖరి

ఈ ఎంపిక విషయంలోనూ మొదటి నుంచి వామపక్షాలు పై గీటురాళ్ల ఆధారంగానే వ్యవహరిస్తున్నాయి. ఏదో వ్యక్తులను బట్టి తాత్కాలిక హడావుడిని బట్టి నిర్ణయాలు తీసుకోలేదు. ఉదాహరణకు జైల్‌సింగ్‌ను మళ్లీ నిలబెట్టాలని ఎన్టీఆర్‌ ప్రతిపాదిస్తే సరికాదని చెప్పాయి. జిజి స్వెల్‌ను కూడా అభ్యర్థిగా అంగీకరించకుండా కృష్ణయ్యర్‌ను నిలబెట్టాయి. మహిళ లేదా దళితుల పేరిట ఇతర అంశాలు విస్మరిస్తున్నప్పుడు మొదట నారాయణ్‌ను తర్వాత మహిళను ఎన్నుకోవడం మంచిదని సూచించాయి. శాస్త్రజ్ఞుడి పేరుతో అబ్దుల్‌ కలామ్‌ ఆజాద్‌ను నిలబెట్టి అందరూ బలపర్చాలంటే నిరాకరించి లక్ష్మీసైగల్‌ను నిలబెట్టాయి. రెండు మూడు రాష్ట్ర ప్రభుత్వాలున్న సీపీఐ(ఎం) ఈ విషయంలో ముందు నిలిచింది. అప్పటికీ ఇప్పటికీ బలాబలాల పొందికలు మారినా ఈ మౌలికాంశాలలో మార్పులేదు సరికదా మరింత అవశ్యకంగా మారాయి. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ సీతారాం ఏచూరి తదితరులతో సంప్రదింపులు ప్రారంభించడం సహజమే అయినా తుది నిర్ణయం ఆచితూచి తీసుకోవడం అనివార్యమవుతుంది.

అభ్యర్థులపై వూహాగానాలు

ప్రతిపక్షం తరపున కేసీఆర్‌, శరద్‌పవార్‌ వంటి పేర్లు చెబుతున్నా ఆ పోటీలో ఉండేవారు మరే పదవిలో ఉండకూడదు. గెలవని స్థానం కోసం ముఖ్యమంత్రి పదవికి ఎవరు రాజీనామా చేస్తారు? నితిష్‌ కుమార్‌ గులాంనబీ ఆజాద్‌ వంటివారు మొదటే నిలబడకపోవచ్చు. మోడీ జాబితాలో రాజ్‌నాథ్‌సింగ్‌, అరిఫ్‌మహ్మద్‌ ఖాన్‌, ఆనందిబెన్‌ పటేల్‌, ద్రౌపది ముర్ము వంటిపేర్లు వినిపిస్తున్నాయి. అయితే పార్లమెంటుకే ముస్లిం అభ్యర్థిని ఎంపిక చేయని బీజేపీ ఆరిఫ్‌ లేదా నఖ్వీ వంటివారిని ప్రతిపాదించే అవకాశం లేదు. తనకన్నా సీనియర్‌ రాజ్‌నాథ్‌ను మోడీ ఇష్టపడరు. ఇక ఆనందీబెన్‌ గుజరాతీ గనక సమీకరణం కుదరకపోవచ్చు. ఆ విధంగా చూస్తే ముర్ముకే అవకాశాలు ఎక్కువని ఊహిస్తున్నారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడుపైనా కొందరు కావాలని వూహాగానాలు చేస్తున్నా జాతీయ మీడియాలో ఆపేరు కనిపించడం లేదు. రామ్‌నాథ్‌ కోవింద్‌ వంటి వీర విధేయులు సంఘ్ గట్టిగా అంగీకరించేవారు మాత్రమే చివరగా ఎంపికవుతారు.

Tags: ElectionsIndian Presidential ElectionPresidentPresident Elections

admin

Next Post

జూలై 4న ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం పర్యటన

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను వ్యూహాత్మ‌కంగా నిర్వీర్యం చేస్తున్న బీజేపీ?

10 months ago

తెలంగాణలో జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు: ఈటెల రాజేందర్

10 months ago

Popular News

    Connect with us

    PMR News.net

    PMR News is Web Media Channel. PMR News brings the latest Telugu News Headlines From Telangana & Andhra Pradesh, Politics, Sports, Business, Technology, Entertainment, Rasi Phalalu (astrology in telugu) at pmrnews.net

    Category

    • ANDHRA PRADESH
    • EDUCATION & CAREER
    • HEALTH & FITNESS
    • INDIA
    • LIFE STYLE
    • MOVIES
    • PMR News
    • POLITICS
    • SPORTS
    • TECHNOLOGY
    • TELANGANA
    • Trending
    • Uncategorized
    • WORLD

    Site Links

    • Log in
    • Entries feed
    • Comments feed
    • WordPress.org
    • About
    • Advertise
    • Careers
    • Contact

    © 2022 PMR News - All right reserved | Designed by PMR Digital Marketing Agency .

    No Result
    View All Result
    • Home

    © 2022 PMR News - All right reserved | Designed by PMR Digital Marketing Agency .

    Exit mobile version