• About
  • Advertise
  • Careers
  • Contact
Saturday, July 2, 2022
PMR News
  • HOME
  • ANDHRA
  • TELANGANA
  • POLITICS
  • INDIA
  • WORLD
  • MOVIES
  • CAREER
  • TECHNOLOGY
  • LIFE STYLE
  • SPORTS
  • PHOTOS
  • HOME
  • ANDHRA
  • TELANGANA
  • POLITICS
  • INDIA
  • WORLD
  • MOVIES
  • CAREER
  • TECHNOLOGY
  • LIFE STYLE
  • SPORTS
  • PHOTOS
No Result
View All Result
PMR News
No Result
View All Result
Home MOVIES

‘భవదీయుడు భగత్ సింగ్’పై Pawan Kalyan క్లారిటీ..

by admin
June 10, 2022
in MOVIES
0
Pawan Kalyan's Bhavadeeyudu Bhagat Singh, Pawan Kalyan, Bhavadeeyudu Bhagat Singh
0
SHARES
3
VIEWS

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) కాస్త గ్యాప్ తర్వాత కమిటైన సినిమాలలో ‘భవదీయుడు భగత్ సింగ్’ (Bhavadeeyudu Bhagat Singh) కూడా ఒకటి. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం పవన్ చేస్తున్న సినిమాలు ఆలస్యంగా షూటింగ్ జరుపుకుంటుండటమే. ఆయన రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఇటు అభిమానులు, ప్రేక్షకులకోసం సినిమాలు చేస్తూనే అటు ప్రజలకోసం రాజకీయాలపైనా దృష్ఠి పెడుతున్నారు. దానివల్ల అనుకున్న సమయానికి పవన్ సినిమాలు రావడం లేదు. ఇప్పటికే, క్రిష్ (Krish) దర్శకత్వంలో పవర్ స్టార్ నటిస్తున్న పీరియాడిక్ సినిమా ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) 15 నెలలు దాకా షూటింగ్ ఆగిపోయింది. మధ్యలో ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) సినిమా కమిటవడం ఓ కారణం అయితే, కరోనా వేవ్స్ మరో కారణం. ఇవన్నీ పట్టించుకోకుండా పవన్ సినిమాలకు మళ్ళీ బ్రేక్ ఇస్తున్నారని..ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్న సినిమాలు, సెట్స్‌పైకి రావాల్సిన సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయో.. అంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే వీరమల్లు చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకువచ్చి సమాధానం చెప్పారు.ఇక పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) – హరీష్ శంకర్ (Harish Shankar) – మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) కాంబినేషన్‌లో మొదలవ్వాల్సిన ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమా విషయంలో కూడా ఇలాంటి గాలి వార్తలే నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీనికి కూడా తాజాగా పవర్ స్టార్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన పవన్ కళ్యాణ్ ..తాను భవదీయుడు సినిమా చేస్తున్నాను అని..ఇది ఆగిపోలేదని తెలిపారు. దాంతో భవదీయుడు సినిమా గురించి ఇన్నాళ్ళు వచ్చింది సృష్ఠించిన గాలి వార్తలే అని తేలిపోయింది. ఇక ఇప్పటికే పవన్ – హరీష్ కాంబోలో ‘గబ్బర్ సింగ్’ వచ్చి ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో భవదీయుడుపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

admin

admin

Next Post
Nayanthara-Vignesh Shivan's wedding, Nayanthara, vignesh, vignesh shivan,

పెళ్లికి హాజరైన Shah Rukh Khan పై సెటైర్లు.. కారణం ఏంటంటే..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended

Telangana inter results 2022 , TS Inter Result, TS Inter Results 2022, Intermediate Results 2022, TS Intermediate Results 2022, Intermediate Results 2022 TS 1st Year, manabadi inter results 2022 ap

Telangana Inter Results 2022: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు

2 weeks ago
bus passes is a burden for students

విద్యార్థులకు ‘బస్సు’ భారమే! బస్‌పాసులపై ఆర్టీసీ బాదుడు

3 weeks ago

Popular News

    Connect with us

    PMR News.net

    PMR News is Web Media Channel. PMR News brings the latest Telugu News Headlines From Telangana & Andhra Pradesh, Politics, Sports, Business, Technology, Entertainment, Rasi Phalalu (astrology in telugu) at pmrnews.net

    Category

    • ANDHRA PRADESH
    • EDUCATION & CAREER
    • HEALTH & FITNESS
    • INDIA
    • LIFE STYLE
    • MOVIES
    • PMR News
    • POLITICS
    • SPORTS
    • TECHNOLOGY
    • TELANGANA
    • Trending
    • Uncategorized
    • WORLD

    Site Links

    • Log in
    • Entries feed
    • Comments feed
    • WordPress.org
    • About
    • Advertise
    • Careers
    • Contact

    © 2022 PMR News - All right reserved. & Designed by PMR Digital Media.

    No Result
    View All Result
    • Home

    © 2022 PMR News - All right reserved. & Designed by PMR Digital Media.