దాదాపు ఆరేళ్ల ప్రేమించుకున్నతమిళ నటి నయనతార (Nayanthara), దర్శకుడు విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) జూన్ 9న పెళ్లి బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. మహాబలిపురంలో జరిగిన ఈ వివాహానికి భారతీయ సినీ పరిశ్రమల్లోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అందులో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కూడా ఉన్నారు. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఓ సినిమా చేస్తున్నాడు. అందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చనువుతోనే ఈ బ్యూటీ షారుఖ్‌ని తన పెళ్లికి ఆహ్వానించింది.
పెళ్లికి హాజరైన Shah Rukh Khan పై సెటైర్లు.. కారణం ఏంటంటే..అయితే.. షారుఖ్‌కి ఇటీవలే కోవిడ్ సోకింది. ఈ విషయం నాలుగు రోజుల క్రితమే తెలిసింది. కనీసం వారం కూడా గడవకముందే నయనతార, విఘ్నేష్ పెళ్లి వేడుకకి హాజరయ్యాడు. అంతేకాకుండా అట్లీ, అలాగే మరికొందరు ప్రముఖులతో కలిసి ఫొటోలకి ఫోజులిచ్చాడు. దీంతో పలువురు నెటిజన్లు షారుఖ్ మీద సెటైర్లు వేస్తున్నారు. ‘ఇంత త్వరగా కోవిడ్ నుంచి రికవర్ అయ్యాడా’ అంటూ కొందరు.. ‘ఇలాంటి వైరస్‌పై మీడియా ఎందుకు రాద్ధాంతం చేస్తోంది’ అంటూ మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. షారుఖ్‌కి కోవిడ్ సోకినప్పటికీ మామూలు లక్షణాలు మాత్రమే కనిపించడంతో త్వరగా కోలుకున్నట్లు తెలుస్తోంది.