Naga Chaitanya Sobhita Dhulipala Dating:
సమంతతో విడాకులు తీసుకున్నాక వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు అక్కినేని నాగ చైతన్య. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఓ యంగ్ హీరోయిన్‌తో చైతూ పీకల్లోతు ప్రేమలో మునితేలుతున్నారని తెలుస్తోంది. ఆ హీరోయిన్‌తో చైతూ డేటింగ్ చేస్తున్నారనే టాక్ ముదిరింది.
విడాకుల తర్వాత అటు సమంత (Samantha), ఇటు నాగ చైతన్య (Naga Chaitanya) నిత్యం ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇద్దరూ తమ తమ కెరీర్‌పైనే ఫుల్ ఫోకస్ పెట్టినప్పటికీ.. వాళ్ల పర్సనల్ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నాగ చైతన్యకు సంబంధించిన ఓ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
సమంతతో విడాకులు తీసుకున్నాక వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు అక్కినేని నాగ చైతన్య. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఓ యంగ్ హీరోయిన్‌తో చైతూ పీకల్లోతు ప్రేమలో మునితేలుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.
స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లాడిన నాగ చైతన్య ఆమెతో నాలుగేళ్ల పాటు వివాహ బంధాన్ని కొనసాగించారు. అయితే ఉన్నట్టుండి అనూహ్యంగా ఈ ఇద్దరూ విడిపోవడం ఆశ్చర్య పర్చింది. అయితే తమ డివోర్స్‌కి కారణాలు చెప్పకుండా ఇకపై తాము స్నేహితులుగా ఉంటామని ఇద్దరూ ప్రకటించారు.
2010లో వచ్చిన ‘ఏమాయ చేశావే’ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ చైసామ్.. 2017లో వివాహం చేసుకున్నారు. అయితే వారి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతో 2021 అక్టోబర్ 2వ తేదీన విడిపోతున్నామని అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు.
చై సామ్ డివోర్స్ మ్యాటర్ వీరిరువురి అభిమానులను తీవ్రంగా బాధపెట్టింది. అయితే ఆ తర్వాత సమంత, చైతూ తమ కెరీర్‌పై దృష్టి పెడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా నాగ చైతన్య రెండో పెళ్ళికి సంబంధించిన ఎన్నో రూమర్స్ పుట్టుకొస్తున్నాయి.
యంగ్ హీరోయిన్, తెలుగమ్మాయి శోభిత ధూళిపాళతో (Sobhita Dhulipala) నాగ చైతన్య డేటింగ్ (Naga Chaitanya Dating) చేస్తున్నారనే వార్త ఇప్పుడు ఆన్ లైన్ మాద్యమాలపై హల్చల్ చేస్తోంది. కొన్ని నెలలుగా శోభిత ధూళిపాళ- నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నారని, ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారనే టాక్ గుప్పుమంది.
సమంతతో విడాకుల తర్వాత జూబ్లీ హిల్స్‌లోని కొత్త ఇంటిలోకి మారేందుకు సన్నాహాలు చేస్తున్నారు నాగ చైతన్య. అయితే ఈ ఇంటికి అప్పుడప్పుడు శోభిత ధూళిపాళతో కలిసి వస్తున్న నాగ చైతన్య అక్కడ కాసేపు గడిపి తిరిగి వెళ్తున్నారని ఫిలిం నగర్ కోడై కూస్తోంది.
అంతేకాదు ఒకే కారులో శోభిత ధూళిపాళ, నాగ చైతన్య తెగ చక్కర్లు కొడుతున్నారట. ఇటీవల మేజర్ సినిమా షూటింగ్ సమయంలో కూడా శోభితను కలవడానికి నాగ చైతన్య చాలా సార్లు వచ్చారని తెలుస్తోంది. దీంతో నాగ చైతన్య డేటింగ్ ఇష్యూ ఒక్కసారిగా జనాల్లో హాట్ ఇష్యూ అయింది.
మరి నిజంగానే శోభిత ధూళిపాళతో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నారా? త్వరలో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా? అంటే దీనిపై వాళ్లిదరిలో ఎవరో ఒకరు స్పందిస్తే గానీ అసలు మ్యాటర్ చెప్పలేం.