• About
  • Advertise
  • Careers
  • Contact
Saturday, July 2, 2022
PMR News
  • HOME
  • ANDHRA
  • TELANGANA
  • POLITICS
  • INDIA
  • WORLD
  • MOVIES
  • CAREER
  • TECHNOLOGY
  • LIFE STYLE
  • SPORTS
  • PHOTOS
  • HOME
  • ANDHRA
  • TELANGANA
  • POLITICS
  • INDIA
  • WORLD
  • MOVIES
  • CAREER
  • TECHNOLOGY
  • LIFE STYLE
  • SPORTS
  • PHOTOS
No Result
View All Result
PMR News
No Result
View All Result
Home LIFE STYLE

Sologamy.. ఇప్పుడిదే హాట్ టాపిక్.. అమ్మాయిల స్వీయ వివాహం

by admin
June 10, 2022
in LIFE STYLE
0
Salogamy Gujarathi Kshama
0
SHARES
0
VIEWS

ప్రస్తుతం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా చర్చించుకుంటున్న అంశాల్లో ఒకటి. గుజరాత్‌కి చెందిన క్షమా (Kshama) అనే అమ్మాయి తనను తానే వివాహం చేసుకుంటానని చెప్పడంతో ఈ పదం బాగా వాడుకలోకి వచ్చింది. అన్నట్లుగానే ఆ అమ్మాయి జూన్ 9న తనను తానే వివాహం చేసుకుంది. దీంతో అసలు ఈ సోలోగమీ అంటే ఏంటనే చర్చ విపరీతంగా నడుస్తోంది. వరుడు లేకుండా.. వధువు తనను తానే పెళ్లి చేసుకోవడాన్ని సోలోగమీ అంటారు. పాశ్చాత్య దేశాలలో ఇప్పటికే పలు సోలోగమీ వివాహాలు జరిగాయి. అయితే భారతదేశంలో మాత్రం క్షమాదే మొదటి సోలోగమీ మ్యారేజ్ కావడం విశేషం. కాగా.. ఈ కథతో వివిధ దేశాల్లో కొన్ని సినిమాలు సైతం వచ్చాయి. ఆ సినిమాల వివరాలు ఇలా..


ఐ మీ వెడ్ (I me wed)..

ఇది 2017లో విడుదలైన కెనడియన్ టీవీ సిరీస్. ఈ సిరీస్‌ ఇసాబెల్ డార్డెన్ అనే మహిళ నిజ జీవిత ఆధారంగా తెరకెక్కించారు. పెళ్లి వయసు వచ్చిన తర్వాత ఇసాబెల్ తన భాగస్వామి కోసం వెతుకుతుంది. ఈ తరుణంలో వచ్చిన మార్పుల వల్ల చివరకు తనను తానే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది.

గ్లీ (Glee)..
గ్లీ.. అమెరికన్ మ్యూజికల్ కామెడీ డ్రామా టీవీ సిరీస్. సమాజంలోని వివిధ సమస్యలపై తమదైన శైలిలో వ్యవహరించే గ్లీ క్లబ్‌లోని వ్యక్తుల జీవితాల ఆధారంగా ఈ టీవీ షోని రూపొందించారు. ఈ సిరీస్ అమెరికన్ ఛానెల్ ఫాక్స్ నెట్‌వర్క్‌లో 2009 నుంచి 2015 వరకు ప్రసారం అయ్యింది.


రోసాస్ వెడ్డింగ్ (Rosa’s Wedding)..
రోసాస్ వెడ్డింగ్.. ఇది స్పానిష్ కామెడీ సినిమా. పనికి, కుటుంబానికి మధ్య జరిగే డ్రామాతో రోజా అనే మహిళ పలు సమస్యలు ఎదుర్కొంటుంది. వాటి కారణంగా చాలా ఇబ్బందులు పడిన రోజా చివరకు తనను తానే వివాహం చేసుకొని మిగిలిన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటుంది. 2020లో విడుదలైన ఈ మూవీ మంచి ఆదరణ పొందింది.


అన్నే విత్ యాన్ ‘ఈ’ (Anne with An ‘E’)..
అన్నే విత్ యాన్ ‘ఈ’.. కెనడియన్ టెలివిజన్ సిరీస్. మార్చి 19, 2017న CBCలో ప్రసారమైన ఈ సిరీస్.. మే 12 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ టీవీ సిరీస్ 13 ఏళ్ల అన్న్ అనే అనాథ కథతో తెరకెక్కింది. ఈ అమ్మాయి ఇతరుల ఇళ్లలో పని చేస్తూ ఉంటుంది. అయితే.. జీవితంలో ఆమె ఎదుర్కొన్న వివిధ పరిస్థితుల ఆధారంగా తనను తానే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది.

admin

admin

Next Post
Having trouble sleeping at night ..

రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క ఇబ్బంది ప‌డుతున్నారా..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended

PCI Chief Justice Ranjana Prakash Desai, ranjana prakash desai husband, ranjana prakash desai contact details, mike desai, ranjana prakash desai commission upsc, delimitation commission, delimitation commission of india, New PCI Chief Justice Ranjana Prakash Desai

Justice Ranjana Prakash Desai : ప్రెస్‌ కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి

2 weeks ago
Gannavaram MLA Vallabhaneni Vamsi, GannavaramGannavaram Vallabhaneni Vamsi

Gannavaram MLA Vallabhaneni Vamsi తీవ్ర అస్వస్థత

1 week ago

Popular News

    Connect with us

    PMR News.net

    PMR News is Web Media Channel. PMR News brings the latest Telugu News Headlines From Telangana & Andhra Pradesh, Politics, Sports, Business, Technology, Entertainment, Rasi Phalalu (astrology in telugu) at pmrnews.net

    Category

    • ANDHRA PRADESH
    • EDUCATION & CAREER
    • HEALTH & FITNESS
    • INDIA
    • LIFE STYLE
    • MOVIES
    • PMR News
    • POLITICS
    • SPORTS
    • TECHNOLOGY
    • TELANGANA
    • Trending
    • Uncategorized
    • WORLD

    Site Links

    • Log in
    • Entries feed
    • Comments feed
    • WordPress.org
    • About
    • Advertise
    • Careers
    • Contact

    © 2022 PMR News - All right reserved. & Designed by PMR Digital Media.

    No Result
    View All Result
    • Home

    © 2022 PMR News - All right reserved. & Designed by PMR Digital Media.