12,000 couples from 60 districts across the state got married under the Utter Pradesh Chief Minister Yogi Adityanath’s Samuhik Vivah Scheme. The scheme aims to help people from poor families get married with the government bearing the entire cost of the ceremony.
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సామూహిక వివాహాల్లో వేలాదిమంది జంటలు ఒక్కటయ్యాయి. రాష్ట్రంలోని 60 జిల్లాల్లో జరిగిన ఈ సామూహిక పెళ్లిళ్ల ద్వారా 12 వేల జంటలు వివాహ బంధంలోకి అడుగుపెట్టాయి. మతాలకు అతీతంగా జరిగిన ఈ వివాహాల సందర్భంగా ప్రభుత్వం ఒక్కో వధువు ఖాతాలో రూ. 35 వేల చొప్పున జమ చేసింది.
Shubh Mangal Samuhik vivah scheme
రెండో విడత సామూహిక వివాహాలు ఈ నెల 17న నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. లక్నోలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అసిం అరుణ్ మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు చేయూత ఇవ్వడంతోపాటు వరకట్న దురాచారానికి అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వం ఈ సామూహిక వివాహ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.