Esther Anil ready for Tollywood Entry:


కేరళకు చెందిన ఈ మలయాళ కుట్టి ఎస్తేర్ అనిల్ వయనాడ్‌లో 2001లో జన్మించింది. 2010లో అంటే దాదాపు తొమ్మిదేళ్ల వయస్సులో ‘నల్లవన్’ అనే మలయాళ చిత్రంతో బాలనటిగా వెండితెరపైకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చాలా చిత్రాల్లో ఆమె బాలనటిగా నటించి ఆకట్టుకుంది. ఫలితంగా ఆమెకు 2013లో మలయాళ చిత్రం ‘దృశ్యం’లో అవకాశం వచ్చింది. అప్పటికి ఆమె వయస్సు 12 ఏళ్లు. ఆ తర్వాత 2014లో తెలుగులో రిమేక్ చేసిన ‘దృశ్యం’లో కూడా ఆమే నటించింది. అప్పటికి ఆమెకు 13 ఏళ్లు. చూసేందుకు చిన్న పిల్లగా కనిపించడంతో ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయింది.


‘దృశ్యం’ హిట్ కొట్టినా.. ఆ చిత్ర దర్శక నిర్మాతలు ‘దృశ్యం-2’ను తెరకెక్కించేందుకు చాలా టైమ్ తీసుకున్నారు. మొదటి పార్ట్ కంటే థ్రిల్లింగ్ ఎక్స్‌పీయరెన్స్ ఇచ్చేందుకు ఆరేళ్లు కష్టపడ్డారు. ఈలోపు ఆ చిత్రంలో చిన్నారిగా మెప్పించిన ఎస్తేర్ వయస్సు కూడా పెరిగిపోయింది. గతేడాది ‘జోహార్’ మూవీలో తళుక్కుమంది. మొత్తానికి ‘దృశ్యం 2’ కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీలో విడుదలైన తెలుగు ‘దృశ్యం 2’తో మంచి మైలేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎస్తేర్ కూడా తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడింది.


ప్రస్తుతం ఎస్తేర్‌కు 21 ఏళ్లు.. ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కృతి శెట్టికి 18 ఏళ్లు. ఈ లెక్కన చూసుకుంటే.. ఎస్తేర్ హీరోయిన్‌గా తన లక్‌ను పరీక్షించుకోడానికి అన్నివిధాలా అర్హురాలే. అయితే.. ముందుగా యంగ్ హీరోల సరసన నటించడానికి ఆమె ‘బాలనటి’ మార్క్ నుంచి బయటపడాలి. అందుకే.. అందాల ఆరబోతతో ఎలాంటి పాత్రలకైనా సిద్ధమేనని గ్రీన్ సిగ్నల్ ఇస్తోందిఈ బ్యూటీ..