CCS Police Raids in Yerragondapalem YSRCP leaders House and Rs 25 crore worth emerald Panchamukha Vinayaka Idol
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఇళ్లల్లో సీసీఎస్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అత్యంత ఖరీదైన విగ్రహాన్ని వైసీపీ నేత ఇంట్లో గుర్తించారు. అయితే చివర్లో ఊహించిన ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో YSRCPకి చెందిన నేత ఇంట్లో ఒంగోలు CCS పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో భాగంగా వైసీపీ నేత ఇంట్లో ఓ అత్యంత ఖరీదైన మరకత పంచముఖ వినాయక విగ్రహం లభ్యమైంది. ఈ విగ్రహం విలువ కోట్ల రూపాయలు ఉంటుందని సీసీఎస్ పోలీసులు అంచనా వేస్తున్నారు. ఖరీదైన విగ్రహం రహస్యంగా ఇంట్లో దాచిన కేసులో నేతను, ఈ వ్యవహారంతో సంబంధం ఉందనే అనుమానంలో గ్రామ నేత గజ్జెల చెన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు.
ఖరీదైన మరకత పంచముఖ వినాయక విగ్రహం ఇంట్లో ఉండటంపై సీసీఎస్ పోలీసులకు ఆ నేత వివరణ ఇచ్చుకున్నారు. ఆ విగ్రహం తమ వద్ద ఉంచుకునేందుకు అన్ని అనుమతులు ఉన్నాయని సీసీఎస్ పోలీసులకు తెలిపారు. అదే నిజమైతే, అందుకు సంబంధించిన అనుమతి ఉత్తర్వు కాపీలను తమకు చూపించాలని సూచించి, వారిని విడిచిపెట్టారు. ఈ ఖరీదైన విగ్రహాన్ని Hyderabad నుంచి ప్రకాశం జిల్లాకు తీసుకొచ్చినట్లు ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. ఉన్నతస్థాయి నేతల నుంచి ఒత్తిడి రావడంతో విగ్రహాన్ని వారి వద్ద ఉంచుకొని.. పోలీసులు నిందితులను వదిలేసినట్లు తెలుస్తోంది. ఓ పంచాయతీ కార్యదర్శి హస్తం ఉందని, ఆ కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు.
విగ్రహం రెండున్నర అడుగుల ఎత్తు, రెండడుల వెడల్పు దాదాపు 90 కిలోల బరువు ఉన్నట్లు సమాచారం. సాధారణంగా Nallamala forest ప్రాంతం, ఆలయాల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని, విగ్రహం లభించిందనే సమాచారంతో Ongole పోలీసులు రంగంలోకి దిగారు. విగ్రహాన్ని కొనేందుకు వెళ్తున్న వ్యక్తుల్లా వెళ్లిన పోలీసులు విక్రేతల నుంచి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని వెనుక అధికార పార్టీ నేత ఉన్నారని సమాచారం. అక్కడే పంచాయతీ కార్యదర్శిగా చేసే వ్యక్తి, హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేసే అతని అల్లుడు ఈ విగ్రహం విక్రయించాలని తమకు చెప్పారని పోలీసులు పట్టుకున్న వ్యక్తులు చెప్పారు. చివరగా ఈ విషయంపై Yerragonda Palem పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. విగ్రహం స్వాధీనం చేసుకున్న ఇంటి యాజమానికి Section 41 కింద నోటీసులు ఇచ్చామని ఎస్సై కోటయ్య తెలిపారు. విచారణ పూర్తిచేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.